ఎల్అండ్టి టెక్నాలజీ సర్వీసెస్ భారీ డీల్ | L&T Technology bags multi-million dollar contract | Sakshi
Sakshi News home page

ఎల్అండ్టి టెక్నాలజీ సర్వీసెస్ భారీ డీల్

Oct 19 2016 1:13 PM | Updated on Sep 4 2017 5:42 PM

ప్రముఖ ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రోకు చెందిన ఎల్ అండ్ టి టెక్నాలజీ సర్వీసెస్ మల్టీ మిలియన్ డాలర్ల కాంట్రాక్టును సొంతం చేసుకుంది.

న్యూఢిల్లీ: ప్రముఖ ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రోకు   చెందిన ఎల్ అండ్ టి టెక్నాలజీ సర్వీసెస్  మల్టీ మిలియన్ డాలర్ల  కాంట్రాక్టును  సొంతం చేసుకుంది.   ప్రపంచ  అతిపెద్ద సెమీ కండక్టర్ కంపెనీ నుంచి మల్టీ మిలియన్ డాలర్  విలువ చేసే ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు   ఎల్ అండ్ టి టెక్నాలజీ  బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.  తమ రెండు సంస్థల మధ్య కుదిరిన ఈ వ్యూహాత్మక పొత్తులో ఉత్పత్తుల బలోపేతం, ఉన్నతమైన నాణ్యతా ఉత్పత్తులను వినియోగదారులకు అందించనున్నట్టు బీఎస్ఇ ఫైలింగ్  లో తెలిపింది.  దీంతో బుధవారం నాటి మార్కెట్ లో 0.79 శాతం ఎగిసింది. అయితే, ఈ ఒప్పందం మొత్తం విలువ  ఇంకా బహిర్గతం చేయలేదు.
 
బహుళ సంవత్సరాల భాగస్వామ్య అవార్డు గెల్చుకున్న తమ సంస్థ  ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా నిలిచిందని ఎల్ అండ్ టి టెక్ సీఈఓ, ఎండీ కేశవ్ పాండా చెప్పారు.   ప్రపంచ వినియోగదారులకు కటిండ్ ఎడ్జ్ సర్వీసెస్ అండ్   సొల్యూషన్స్ అందించే ప్రక్రియ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. కాగా ఈ సెప్టెంబర్ ఐపీవోలో రూ. 900 కోట్లను  సాధించిన  సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement