ఏపీ యువతికి అమెరికా హెల్త్‌కేర్ లీడర్‌షిప్ అవార్డు | Korrapati Priya gets US Healthcare Leadership Award | Sakshi
Sakshi News home page

ఏపీ యువతికి అమెరికా హెల్త్‌కేర్ లీడర్‌షిప్ అవార్డు

Nov 16 2013 2:32 AM | Updated on Sep 2 2017 12:38 AM

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతికి అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన హెల్త్‌కేర్ లీడర్‌షిప్ అవార్డు ఈ ఏడాది కర్నూలు జిల్లాకు చెందిన కొర్రపాటి ప్రియను వరించింది.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతికి అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన హెల్త్‌కేర్ లీడర్‌షిప్ అవార్డు ఈ ఏడాది కర్నూలు జిల్లాకు చెందిన కొర్రపాటి ప్రియను వరించింది.  ఇటీవల లాస్‌ఏంజెలిస్‌లో జరిగిన 17వ హెల్త్‌కేర్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్‌లో ఆమెను ఈ అవార్డుతో సత్కరించారు. వైద్య ఆరోగ్య రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ‘ఎండీ కాన్ఫరెన్స్ ఫైండర్ డాట్ కామ్’ సంస్థకు ఆమె సీఈఓగా వ్యవహరిస్తున్నారు. డాక్టర్లకు సంబంధించిన మెడికల్ సెమినార్లు, క్లినికల్ విభాగంలో వస్తున్న ఆధునిక పద్ధతులు, మార్పులు, పరికరాల వివరాలు, వాటి ధరల గురించి ఎప్పటికప్పుడూ ఈ సంస్థ తన వెబ్‌సైట్‌లో తాజా సమాచారం ఉంచుతుంది. సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటివరకూ ఐదు వేలకుపైగా ఉచిత ఆరోగ్య శిబిరాలు కూడా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement