న్యూజిలాండ్ లో భారత సంతతికి చెందిన 25 ఏళ్ల తరుణ్ అస్థానాపై ఓ యువకుడు విచక్షణాత్మకంగా దాడి జరపడంతో అతని పరిస్థితి విషమంగా మారింది.
న్యూజిలాండ్ లో ఎన్నారైపై దాడి, పరిస్థితి విషమం
Nov 3 2013 3:26 PM | Updated on Sep 2 2017 12:15 AM
న్యూజిలాండ్ లో భారత సంతతికి చెందిన 25 ఏళ్ల తరుణ్ అస్థానాపై ఓ యువకుడు విచక్షణాత్మకంగా దాడి జరపడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. ట్రైనీ టీచర్ గా పనిచేస్తున్న తరుణ్ అక్లాండ్ లోని సిటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం రోజున సాయంత్రం 5.10 నిమిషాలకు తరుణ్ పై దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఓ యువతి డ్రస్ బాగుందని కామెంట్ చేయడంలో ఆ యువతి బాయ్ ఫ్రెండ్.. తరుణ్ ముఖం, తలపై బాదినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఈ దాడిలో తరుణ్ తలకు బలమైన గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. ఈ వ్యవహారంలో అక్లాండ్ లో ఓ ఒకర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Advertisement
Advertisement