నేపాల్ లో ఒక్కసారిగా మంచు తుపాన్ సంభవించడంతో 12 మంది మృతి చెందారు.
ఖాట్మండు: నేపాల్ లో ఒక్కసారిగా మంచు తుపాన్ సంభవించడంతో 12 మంది మృతి చెందారు. 85 మంది గల్లంతయ్యారు. మృతులందరూ పర్వతారోహకులే. మానంగ్ జిల్లాలోని తొరాంగ్ పాస్ వద్ద ఈ ఘటన జరిగింది. సముద్రమట్టానికి 5,146 అడుగుల ఎత్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. హదూద్ తుపాన్ ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో మంచు తుపాను సంభవించినట్టు చెబుతున్నారు.
మృతుల్లో భారతీయుడు, నలుగురు కెనడా పౌరులు, ముగ్గురు నేపాలీలు ఉన్నారు. 18 మంది పర్వతారోహకులను నేపాల్ ఆర్మీ కాపాడింది. గాయపడిని 14 మందిని ఖాట్మండులో ఆస్పత్రికి తరలించారు. మంచుకింద చాలా మృతుదేహాలు చూశానని స్థానిక గైడ్ ఒకరు చెప్పడంతో గల్లైంతన వారు మరణించివుంటారని భావిస్తున్నారు. దౌలాగిరిలో మరో నలుగురు గల్లంతయ్యారు. వీరి కోసం నేపాల్ ఆర్మీ హెలికాప్టర్లతో గాలింపు చేపట్టింది.