భార్యాబిడ్డల కిడ్నాప్‌తో ఓ భర్త అఘాయిత్యం! | husband committed suicide | Sakshi
Sakshi News home page

భార్యాబిడ్డల కిడ్నాప్‌తో ఓ భర్త అఘాయిత్యం!

Jun 6 2017 1:41 PM | Updated on Jul 27 2018 2:21 PM

భార్యాబిడ్డల కిడ్నాప్‌తో ఓ భర్త అఘాయిత్యం! - Sakshi

భార్యాబిడ్డల కిడ్నాప్‌తో ఓ భర్త అఘాయిత్యం!

అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో వ్యక్తి తన భార్య, బిడ్డలను కిడ్నాప్‌ చేయటంతో ఈ అవమానాన్ని తట్టుకోలేక

శివాజీనగర (హావేరి): అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో వ్యక్తి తన భార్య, బిడ్డలను కిడ్నాప్‌ చేయటంతో ఈ అవమానాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని హావేరిలో చోటు చేసుకుంది. హుబ్లీలో నివాసముంటున్న ఉదయ్‌ తన వ్యక్తిగత అవసరం నిమిత్తం పవన్‌ అనే వ్యక్తి నుంచి రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. అయితే ఉదయ్‌ అప్పు తిరిగి ఇవ్వలేదు.

అప్పులవారి వేధింపులను తట్టుకోలేక ఉదయ్‌ తన భార్య, పిల్లలతో హుబ్లీని విడిచి హావేరికి చేరుకున్నాడు. హావేరికి తన అనుచరులతో వచ్చిన పవన్‌, ఉదయ్‌ భార్య, బిడ్డలను బలవంతంగా తీసుకుని వెళ్లాడు. దీంతో ఆవేదన గురైన ఉదయ్‌ ఇంటిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై స్థానికులు పవన్‌, అతని అనుచరులపై దాడి చేశారు. పోలీసులు పవన్‌, అతని అనుచరులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement