భూమికి గుడ్‌బై చెప్పాల్సిందే: హాకింగ్‌ | Humans must leave Earth in 100 years to survive: Stephen Hawking | Sakshi
Sakshi News home page

భూమికి గుడ్‌బై చెప్పాల్సిందే: హాకింగ్‌

May 4 2017 9:16 PM | Updated on Sep 5 2017 10:24 AM

భూమికి గుడ్‌బై చెప్పాల్సిందే: హాకింగ్‌

భూమికి గుడ్‌బై చెప్పాల్సిందే: హాకింగ్‌

మానవ జాతి మనుగడ సాగించాలంటే మరో వందేళ్లలో వేరే గ్రహాన్ని ఆవాసంగా మార్చుకోక తప్పదని స్టీఫెన్‌ హాకింగ్‌ హెచ్చరించారు.

లండన్‌: మానవ జాతి మనుగడ సాగించాలంటే మరో వందేళ్లలో వేరే గ్రహాన్ని ఆవాసంగా మార్చుకోక తప్పదని ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ హెచ్చరించారు. వాతావరణ మార్పులు, గ్రహశకలాలు ఢీకొట్టడం, అధిక జనాభా కారణంగా మనుషులు ఇతర గ్రహాలకు వలస వెళ్లక తప్పదని హాకింగ్‌ అభిప్రాయపడ్డారు.

బీబీసీ రూపొందించిన ‘టుమారో వరల్డ్‌’ అనే డాక్యుమెంటరీలో భాగంగా మనుషులు ఇతర గ్రహాలపై నివసించే అంశంపై తన శిష్యుడు క్రిష్టోఫే గల్ఫర్డ్‌తో కలిసి హాకింగ్‌ ప్రపంచమంతా పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో హాకింగ్‌ మాట్లాడుతూ, భవిష్యత్తులో భూమి ఎంతమాత్రం క్షేమకరం కాదని తేల్చిచెప్పారు. మానవులు భూమిని వదిలి మరో గ్రహాన్ని వెతుక్కోవడం ప్రారంభించాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement