హనీమూన్‌లో యూవీ దంపతులు..! | honeymoon for Yuvraj Singh and Hazel Keech | Sakshi
Sakshi News home page

హనీమూన్‌లో యూవీ దంపతులు.. సీ పిక్స్‌!

Dec 14 2016 3:00 PM | Updated on Sep 4 2017 10:44 PM

హనీమూన్‌లో యూవీ దంపతులు..!

హనీమూన్‌లో యూవీ దంపతులు..!

క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌-హజెల్‌ కీచ్‌ దంపతులు ప్రస్తుతం ప్రణయయాత్రలో మునిగితేలుతున్నారు.

గతవారం ఓ ఇంటివారు అయిన క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌-హజెల్‌ కీచ్‌ దంపతులు ప్రస్తుతం ప్రణయయాత్రలో మునిగితేలుతున్నారు. పేరు వెల్లడించిన ప్రదేశంలో బీచ్‌ తీరంలో ఈ జంట హనీమూన్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. నీలి సముద్రపు అలలు, ఇసుకతిన్నెలు, తళతళ మెరిసే ఎండలో విహరిస్తూ ఈ జంట కొన్ని ఫొటోలను తమ అభిమానులతో పంచుకుంది.

తన ప్రియురాలు, బాలీవుడ్‌ నటి అయిన హజెల్‌ కీచ్‌ను గత నెల 30న యువీ పెళ్లాడిన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట డిసెంబర్‌ 12న ఈ స్టైలిస్‌ క్రికెటర్‌ 35వ వసంతంలో అడుగుపెట్టాడు. పుట్టినరోజు సందర్భంగా యూవీని సాటి క్రికెటర్లు, అభిమానులు, శ్రేయోభిలాషులు అభినందనల్లో ముంచెత్తారు. అయితే, తన పుట్టినరోజును తన భాగస్వామితో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నానని యువీ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు. తనకు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. కాగా, తాము హనీమూన్‌ స్వర్గంలో మునిగితేలుతున్నా హజెల్‌ కీచ్‌ ఓ ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement