మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా | HirakhandExpress derailment: railway ministry announces exgratia | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా

Jan 22 2017 9:48 AM | Updated on Sep 5 2017 1:51 AM

ఏపీ రైలు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు కేంద్రం ఎక్స్గ్రేషియా ప్రకటించింది.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు, ఏపీ ప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియాగా ప్రకటించాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి కేంద్రం తరఫున 50 వేల రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామని రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు తెలిపారు.

విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో 41 మందికి పైగా మరణించగా, మరో 100 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ముగ్గురు ఉన్నట్టు గుర్తించారు. గాయపడినవారిలో ఒడిశా, ఏపీకి చెందిన ప్రయాణికులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement