breaking news
HirakhandExpress derailment
-
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు, ఏపీ ప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియాగా ప్రకటించాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి కేంద్రం తరఫున 50 వేల రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 41 మందికి పైగా మరణించగా, మరో 100 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ముగ్గురు ఉన్నట్టు గుర్తించారు. గాయపడినవారిలో ఒడిశా, ఏపీకి చెందిన ప్రయాణికులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. -
ఏపీ రైలు ప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు మరణించడం చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ మోదీ ట్వీట్ చేశారు. రైల్వే శాఖ సహాయక చర్యలను పర్యవేక్షిస్తోందని, క్షతగాత్రులను ఆదుకుంటామని మోదీ పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడినవారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు.. ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 35 మందికి పైగా మరణించగా, మరో 100 మంది గాయపడ్డారు.