తల్లిని కట్టేసి ... కుమార్తెని అపహరించి ... | Girl abducted, gangraped in UP | Sakshi
Sakshi News home page

తల్లిని కట్టేసి ... కుమార్తెని అపహరించి ...

May 29 2015 11:08 AM | Updated on Sep 3 2017 2:54 AM

తల్లిని కట్టేసి ... కుమార్తెని అపహరించి ...

తల్లిని కట్టేసి ... కుమార్తెని అపహరించి ...

పొలంలో తల్లికి చేదోడుగా పని చేస్తున్న 20 ఏళ్ల యువతిని అపహరించేందుకు ముగ్గురు యువకులు యత్నించారు.

ముజఫర్నగర్: పొలంలో తల్లికి చేదోడుగా పని చేస్తున్న 20 ఏళ్ల యువతిని అపహరించేందుకు ముగ్గురు యువకులు యత్నించారు. ఆ క్రమంలో తల్లి అడ్డుపడింది. దాంతో ఆగ్రహించి సదరు యువకులు... ఆమెను చెట్టుకు కట్టేశారు. అనంతరం ఆమె కుమార్తెను ఎత్తుకుపోయి... ఆపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణమైన సంఘటన ఉత్తరప్రదేశ్ షామిల్ జిల్లాలోని సకోటి గ్రామంలో ఈ నెల 25వ తేదీన చోటు చేసుకుంది. బాధితురాలిని గురువారం గ్రామస్థులు రక్షించారు.

అనంతరం వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు నిందితులలో మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరు నిందితులు రజనీష్, సచిన్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా... ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ అయిందని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement