తమిళనాడులోని ఈరోడ్లో జైన దేవాలయం పూజారిపై ముగ్గురు వ్యక్తులు దాడిచేసి, ఆలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు.
తమిళనాడులోని ఈరోడ్లో జైన దేవాలయం పూజారిపై ముగ్గురు వ్యక్తులు దాడిచేసి, ఆలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ ముఠా సభ్యుల్లో ఒకరు కారులో రాగా మరో ఇద్దరు ద్విచక్రవాహనాల మీద వచ్చారు. ముగ్గరుఇలో ఒకరు బాగా తప్పతాగి ఆలయంలోకి వస్తుండగా పూజారి ఆపి ప్రశ్నించారు. వెంటనే అతడు పూజారిపై తనవద్ద ఉన్న సీసాతో దాడి చేయడంతో ఆయన ఎడమ చెవికి తీవ్రగాయమైంది.
అనంతరం ఆ ముఠా సభ్యులు లోపలున్న సామగ్రిని ధ్వంసం చేశారు. అయితే అదృష్టవశాత్తు గర్భగుడి తలుపులు మాత్రం తాళం వేసి ఉండటంతో వాళ్లు ఆ లోపలికి ప్రవేశించలేకపోయారని పోలీసులు తెలిపారు. ఇక్కడ గొడవ విన్న స్థానికులు వెంటనే అక్కడకు రావడంతో ముగ్గురూ మోటారు సైకిళ్ల మీద పారిపోయారు. నిందితులను అరెస్టు చేయాలంటూ స్థానికులు రోడ్డుమీద బైఠాయించి ధర్నా చేశారు.