హిల్లరీ గెలిస్తే.. ఆయన్ని ఏమని పిలవాలి? | First Gentleman? Mr President? What To Call Bill If Hillary Wins? | Sakshi
Sakshi News home page

హిల్లరీ గెలిస్తే.. ఆయన్ని ఏమని పిలవాలి?

Nov 7 2016 12:35 PM | Updated on Oct 5 2018 9:09 PM

హిల్లరీ గెలిస్తే.. ఆయన్ని ఏమని పిలవాలి? - Sakshi

హిల్లరీ గెలిస్తే.. ఆయన్ని ఏమని పిలవాలి?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలిస్తే.. ఆమె భర్త బిల్ క్లింటన్ ఏమని పిలవాలా అని ప్రస్తుతం అమెరికన్ల మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలిస్తే.. ఆమె భర్త బిల్ క్లింటన్ ఏమని పిలవాలా అని ప్రస్తుతం అమెరికన్ల మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఇంతకమున్నపెన్నడూ అమెరికా అధ్యక్ష పీఠాన్ని మహిళలు చేపట్టలేదు. హిల్లరీ గెలుపుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో, తొలి మహిళా అధ్యక్షురాలి జీవిత భాగస్వామిగా బిల్ క్లింటన్ వైట్హోస్కు రానున్నారు. అంతేకాక బిల్ క్లింటన్ ఇంతకముందే అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేయడంతో, వైట్హోస్కు రాబోతున్న తొలి మాజీ అధ్యక్షుడు కూడా ఇతనే కానుండటం గమనార్హం. దీంతో బిల్ క్లింటన్ను మిస్టర్ ప్రెసిడెంట్ అని పిలవాలా? ఫస్ట్ జెంటిల్మ్యాన్ అని పిలవాలా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.  
 
అధ్యక్షురాలికి భాగస్వామిగా రాబోతున్న వారికి స్టేట్ లెవల్లో ఏమని అడ్రస్ చేయాలా అని సందిగ్ధత ఏర్పడిందని, ఇప్పటివరకు పురుష అధ్యక్ష భాగస్వామికి ఎలాంటి రోడ్ మ్యాప్ లేదని అమెరికన్లు పేర్కొంటున్నారు. దీనిపై ఎవరికి తోచిన విధంగా వారు సలహాలు ఇస్తున్నారు. అమెరికాలో ఆరుగురు మహిళా గవర్నర్లు ఉన్నారని, వారి భర్తలను అనధికారికంగా మొదటి జెంటిల్మ్యాన్గా పిలుస్తున్నారని చెప్పారు. కానీ అధ్యక్షురాలి భర్తలకు ఎలాంటి నిబంధనలు లేవని తెలిపారు. ఒక్కసారి ప్రెసిడెంట్ అయితే, ఆయన జీవితాంతం అధ్యక్షుడిగానే గుర్తింపు పొందుతారని పేర్కొంటున్నారు. ఒకవేళ హిల్లరీ అధ్యక్షుడిని పెళ్లి చేసుకుని ఉండకపోతే, ఆయన్ని మొదటి జెంటిల్మ్యాన్గానే పిలువబడేవాడని...కానీ అంతకమున్నుపే బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా పనిచేయడంతో, ఆయన మాజీ అధ్యక్షుడిగానే పరిగణించబడతారని కొందరు అంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement