బంగ్లాదేశ్లో నౌక మునిగి 250 మంది గల్లంతు | Ferry with over 250 sinks in Bangladesh, many missing | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్లో నౌక మునిగి 250 మంది గల్లంతు

May 15 2014 6:13 PM | Updated on Apr 3 2019 5:24 PM

బంగ్లాదేశ్లో నౌక మునిగిన దుర్ఘటనలో 250 మందిపైగా గల్లంతయ్యారు.

ఢాకా: బంగ్లాదేశ్లో నౌక మునిగిన దుర్ఘటనలో 250 మందిపైగా గల్లంతయ్యారు. ఢాకాకు 27 కిలోమీటర్ల దూరంలో మున్షిగంజ్ సమీపంలో మేఘనా నదిలో భారీ నౌక మునిగిపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తుఫాను, భారీ వర్షం కారణంగానే పడవ మునిగిపోయింది.

ప్రమాద సమయంలో పడవలో 250 నుంచి 300 మంది ప్రయాణిస్తున్నారని స్థానిక వార్తా సంస్థ తెలిపింది. అయితే ప్రమాదంలో ఎంత మంది గల్లంతయ్యారన్నది కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. చాలా మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని అధికారులు తెలిపారు. గల్లంతైన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement