విజిలెన్స్ విభాగంలో ఎక్స్ క్యాడర్ పోస్టు | Ex cadre post in Vigilance wing | Sakshi
Sakshi News home page

విజిలెన్స్ విభాగంలో ఎక్స్ క్యాడర్ పోస్టు

Aug 17 2015 7:25 PM | Updated on Sep 3 2017 7:37 AM

రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ విభాగంలో ఎక్స్ క్యాడర్ పోస్టు సృష్టించారు. అదనపు డీజీ స్థాయిలో దీన్ని సృష్టిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్ సిటీ: రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ విభాగంలో ఎక్స్ క్యాడర్ పోస్టు సృష్టించారు. అదనపు డీజీ స్థాయిలో దీన్ని సృష్టిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 29 వరకు ఆ పోస్టు కొనసాగుతుందని, అవసరాన్ని బట్టి కాలపరిమితిని పొడిగించుకునే అవకాశం ఉందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఓటుకు కోట్లు’ వ్యవహారం నేపథ్యంలో అప్పటి నిఘా చీఫ్ ఏఆర్ అనురాధపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం గత నెల 6న ఆమెను విజిలెన్స్ విభాగం అధిపతిగా బదిలీ చేసిన విషయం విదితమే. ఆమెకు జీతభత్యాల చెల్లింపుల్లో సాంకేతిక ఇబ్బందులు రాకుండా ఈ ఎక్స్ క్యాడర్ పోస్టు సృష్టించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement