సీమాంధ్రలో విద్యా సంస్థల బంద్ | Educational institutions closed in Seemandhra | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో విద్యా సంస్థల బంద్

Sep 23 2013 12:04 PM | Updated on Sep 1 2017 10:59 PM

సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. మద్దతుగా సీమాంధ్ర ప్రాంతంలో విద్యా సంస్థలు సోమవారం నుంచి బంద్ పాటిస్తున్నాయి.

సీమాంధ్ర ప్రాంతంలో  సమైక్యాంధ్ర ఉద్యమం రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. మద్దతుగా సీమాంధ్ర ప్రాంతంలో విద్యా సంస్థలు సోమవారం నుంచి బంద్ పాటిస్తున్నాయి. 55 రోజులుగా సాగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థల్ని ఈ నెల 30 వరకు మూసివేయనున్నారు. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. 450 ప్రైవేటు విద్యాసంస్థలు, 80 జూనియర్ కాలేజీలు
8 పాలిటెక్నికల్, 75 డిగ్రీ కాలేజీలు, 15 పీజీ కాలేజీలు, 9 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. విశాఖపట్నంలో 30వరకు విద్యాసంస్ధలు బంద్ పాటిస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. ఇక నెల్లూరులో దాదాపు 1,200 ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో 300మీటర్ల జాతీయజెండాతో మానవహారం నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో 6వేల మంది విద్యార్ధులతో విద్యార్ధి గర్జన నిర్వహించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement