ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. | couple suicide in Gajapati district | Sakshi
Sakshi News home page

ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు..

Jun 23 2016 1:32 AM | Updated on Jul 10 2019 8:00 PM

ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. - Sakshi

ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు..

ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. దూరంగా వెళ్లిపోయి జీవిస్తున్నారు.. కొన్నేళ్ల తర్వాత ఇంటికి వచ్చినా కుటుంబ సభ్యుల ఆదరించలేదు.

కుటుంబ సభ్యుల నిరాకరణే   కారణం
గజపతి జిల్లా : ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. దూరంగా వెళ్లిపోయి జీవిస్తున్నారు.. కొన్నేళ్ల తర్వాత ఇంటికి వచ్చినా కుటుంబ సభ్యుల ఆదరించలేదు. దీంతో మనస్థాపానికి గురైన వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుమ్మ సమితి ఉక్కుర పంచాయితీ అనుకంప గ్రామంలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి.
 
 ఉక్కుర పంచాయతీ అనుకంప గ్రామానికి చెందిన బిజి బిరువా (26), రాయగడ గ్రామానికి చెందిన సాయిబానీ గొమాంగో (24) కొన్నేళ్ల కిందట ప్రేమించుకున్నారు. వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన వీరు పెళ్లి చేసుకుని ముంబాయి వెళ్లిపోయారు. పదేళ్ల తర్వాత రెండు రోజుల కిందట వారు బిజిబిరువా స్వగ్రామమైన అనుకంప గ్రామానికి వచ్చారు.
 
 అతని కుటుంబ సభ్యులు, బంధువులు వారిని ఆదరించలేదు. కులాంతర వివాహం, ఇతర పట్టింపులతో వారిద్దరూ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. మంగళవారం రాత్రి గ్రామ శివారులోని చింతచెట్టుకు ఉరివేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సెరంగో  ఐఐసీ చంద్రమణి సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement