
విభజన.. రాజ్యాంగ ఉల్లంఘనే: అశోక్‌బాబు
విభజనకు సంబంధించి జీఓఎం ప్రతిపాదించిన 11 అంశాల్లో.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా ఏ ఒక్క అంశానికి పరిష్కారం దొరకదని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు.
సాక్షి, హైదరాబాద్: విభజనకు సంబంధించి జీఓఎం ప్రతిపాదించిన 11 అంశాల్లో.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా ఏ ఒక్క అంశానికి పరిష్కారం దొరకదని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. ఏపీఎన్జీవో భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏదో ఒక ప్రాంతానికి అన్యాయం చేయకుండా రాష్ట్రాన్ని విభజించగలిగే పరిస్థితి లేదన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి, ఉద్యోగుల ఉద్యమానికి సంబంధం లేదన్నారు. విభజన బిల్లు అసెంబ్లీకి వస్తే చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణను ఈనెల 24న జరిగే ఉద్యోగ సంఘాల జేఏసీల సమావే శంలో నిర్ణయిస్తామన్నారు.