కాంగ్రెస్, బీజేపీకా సీన్ లేదు: బర్ధన్ | Congress, BJP won't be able to form government post 2014 polls: CPI | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, బీజేపీకా సీన్ లేదు: బర్ధన్

Dec 23 2013 2:29 AM | Updated on Sep 2 2017 1:51 AM

కాంగ్రెస్, బీజేపీకా సీన్ లేదు: బర్ధన్

కాంగ్రెస్, బీజేపీకా సీన్ లేదు: బర్ధన్

2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ రెండింటిలో ఏ పార్టీ కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని సీపీఐ పేర్కొంది.

భువనేశ్వర్: 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ రెండింటిలో ఏ పార్టీ కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని సీపీఐ పేర్కొంది. లెఫ్ట్, ప్రాంతీయ పార్టీలు, ప్రజాస్వామ్య శక్తుల కలయికతో ఓ ఆచరణీయమైన ప్రత్యామ్నాయాన్ని రూపొందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ అగ్రనేత ఏబీ బర్ధన్ తెలిపారు. ‘ప్రజాగ్రహం వల్ల కాంగ్రెస్‌కు తిరిగి అధికారం దక్కే అవకాశాల్లేవు.

అటు బీజేపీ పరిస్థితి చూస్తే.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాలను గెలుచుకునే పరిస్థితి లేదు’ అని అన్నారు. ఆదివారమిక్కడ బర్ధన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో సమావేశమయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర  ప్రత్యామ్నాయం ఏర్పాటు కాగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement