'భోగాపురం ఎయిర్పోర్టుకు మేం వ్యతిరేకం' | congres party is against to construction of airport in bhogapuram says botsa satyanarayana | Sakshi
Sakshi News home page

'భోగాపురం ఎయిర్పోర్టుకు మేం వ్యతిరేకం'

Apr 11 2015 7:11 PM | Updated on Sep 3 2017 12:10 AM

'భోగాపురం ఎయిర్పోర్టుకు మేం వ్యతిరేకం'

'భోగాపురం ఎయిర్పోర్టుకు మేం వ్యతిరేకం'

భోగాపురంలో ఎయిర్పోర్టు నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ చెప్పారు.

జిల్లాలోని భోగాపురంలో ఎయిర్పోర్టు నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ చెప్పారు. ఎయిర్ పోర్టు నిర్మాణం పేరుతో 15 వేల ఎకరాలు సేకరించడం దారుణమని, నిర్మాణంపై స్థానిక ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. విజయనగరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని తరహాలో భూసేకరణ చేస్తామంటే కుదరదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇదే విషయమై రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని మాట్లాడుతూ భోగాపురంలో ఎయిర్పోర్టు నిర్మాణంపై తర్వలోనే రైతులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడతామన్నారు. భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తేనే విమానాశ్రయాన్ని ఏర్పాటుచేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement