అపార్ట్‌మెంట్‌లో కాల్పుల కలకలం | Caused fire in the apartment | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్‌లో కాల్పుల కలకలం

Sep 10 2015 2:07 AM | Updated on Sep 3 2017 9:04 AM

అపార్ట్‌మెంట్‌లో కాల్పుల కలకలం

అపార్ట్‌మెంట్‌లో కాల్పుల కలకలం

కాల్పుల ఘటనతో హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది...

- వ్యక్తిపై రాడ్‌తో దాడి చేసిన దుండగులు
- ఘటనా స్థలంలో బుల్లెట్ స్వాధీనం
- హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్‌లో ఘటన
హైదరాబాద్:
కాల్పుల ఘటనతో హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గుర్తుతెలియని దుండగులు స్థానిక ఉషోదయ అపార్ట్‌మెంట్‌లో ఉండే రాఘవశర్మ (58) పై రాడ్డుతో దాడి చేసి గాలిలోకి కాల్పులు జరిపి పరారయ్యారు. మంగళవారం రాత్రి  9.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాఘవ శర్మ అఫ్జల్‌గంజ్‌లోని శ్రీ వేంకటేశ్వర మెటల్ స్టోర్స్‌లో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. ఉద్యోగం ముగించుకుని మంగళవారం రాత్రి బస్సులో షాపూర్‌నగర్ చేరుకున్నారు. ఉషోదయ అపార్ట్‌మెంట్ మూడవ అంతస్తులో ఉండే తన నివాసానికి వెళ్లేందుకు లిఫ్ట్ వద్ద నిల్చున్నారు.

ఆ సమయంలో వెనక నుంచి వచ్చిన దుండగులు శర్మ చేతిలో ఉన్న బ్యాగును లాక్కునేందుకు ప్రయత్నించారు. అతడు ప్రతిఘటించడంతో రాడ్డుతో దాడి చేసి గాయపరిచారు. గాలిలోకి కాల్పులు జరిపి బ్యాగ్‌తో ద్విచక్రవాహనంపై ఉడాయించారు. తుపాకీ శబ్దం విన్న అపార్ట్‌మెంట్ వాసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని గాయపడ్డ శర్మను ఆస్పత్రికి తరలించారు. శర్మ ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు. తమకు విరోధులెవరూ లేరని శర్మ కుటుంబ సభ్యులు తెలిపారు. దుండగులు తీసుకెళ్లిన బ్యాగ్‌లో లంచ్ బాక్స్ తప్ప మరే వస్తువులు లేనట్లు తెలిసింది.
 
రాత్రి లేని బుల్లెట్ పొద్దున ప్రత్యక్షం..

ఘటన స్థలంలో మంగళవారం రాత్రి పోలీసులకు తుపాకి పేల్చినట్టు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. కానీ, బుధవారం ఉదయం స్థానికులు ఘటనా స్థలంలో నాటు తుపాకీ బుల్లెట్ ఉన్నట్లు గుర్తించారు. విషయాన్ని పోలీసులకు తెలపడంతో వారు బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ సిబ్బందితో ఆధారాల కోసం వెతుకుతున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement