breaking news
Thugs Shooting
-
పులిని చంపి, కాళ్లు అపహరణ
మైసూరు : నాటు తుపాకీతో పులిని చంపిన దుండగులు దాని నాలుగు కాళ్లను కత్తిరించుకుని వెళ్లారు. ఈ దారుణం మైసూరు జిల్లాలోణి నాగరహొళె అడవుల్లోని కల్లహళ్లి వద్ద జరిగింది. సుమారు ఆరు సంవత్సరాల వయసు ఉన్న పులిని వేటాడి చంపి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గస్తీలో ఉన్న అటవీ సిబ్బంది గుర్తించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పులి గోర్ల కోసమే కాళ్లను తీసుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు. నల్లబజారులో పులి అవయవాలకు డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు పులుల ప్రాణాలు తీస్తున్నారు. -
అపార్ట్మెంట్లో కాల్పుల కలకలం
- వ్యక్తిపై రాడ్‌తో దాడి చేసిన దుండగులు - ఘటనా స్థలంలో బుల్లెట్ స్వాధీనం - హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్‌లో ఘటన హైదరాబాద్: కాల్పుల ఘటనతో హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గుర్తుతెలియని దుండగులు స్థానిక ఉషోదయ అపార్ట్మెంట్లో ఉండే రాఘవశర్మ (58) పై రాడ్డుతో దాడి చేసి గాలిలోకి కాల్పులు జరిపి పరారయ్యారు. మంగళవారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాఘవ శర్మ అఫ్జల్‌గంజ్‌లోని శ్రీ వేంకటేశ్వర మెటల్ స్టోర్స్‌లో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. ఉద్యోగం ముగించుకుని మంగళవారం రాత్రి బస్సులో షాపూర్‌నగర్ చేరుకున్నారు. ఉషోదయ అపార్ట్మెంట్ మూడవ అంతస్తులో ఉండే తన నివాసానికి వెళ్లేందుకు లిఫ్ట్ వద్ద నిల్చున్నారు. ఆ సమయంలో వెనక నుంచి వచ్చిన దుండగులు శర్మ చేతిలో ఉన్న బ్యాగును లాక్కునేందుకు ప్రయత్నించారు. అతడు ప్రతిఘటించడంతో రాడ్డుతో దాడి చేసి గాయపరిచారు. గాలిలోకి కాల్పులు జరిపి బ్యాగ్‌తో ద్విచక్రవాహనంపై ఉడాయించారు. తుపాకీ శబ్దం విన్న అపార్ట్మెంట్ వాసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని గాయపడ్డ శర్మను ఆస్పత్రికి తరలించారు. శర్మ ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమకు విరోధులెవరూ లేరని శర్మ కుటుంబ సభ్యులు తెలిపారు. దుండగులు తీసుకెళ్లిన బ్యాగ్‌లో లంచ్ బాక్స్ తప్ప మరే వస్తువులు లేనట్లు తెలిసింది. రాత్రి లేని బుల్లెట్ పొద్దున ప్రత్యక్షం.. ఘటన స్థలంలో మంగళవారం రాత్రి పోలీసులకు తుపాకి పేల్చినట్టు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. కానీ, బుధవారం ఉదయం స్థానికులు ఘటనా స్థలంలో నాటు తుపాకీ బుల్లెట్ ఉన్నట్లు గుర్తించారు. విషయాన్ని పోలీసులకు తెలపడంతో వారు బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ సిబ్బందితో ఆధారాల కోసం వెతుకుతున్నారు.