బిల్ క్లింటన్ కు సవాల్ విసిరిన జార్జ్ బుష్! | Bush takes ice bucket challenge, nominates Clinton | Sakshi
Sakshi News home page

బిల్ క్లింటన్ కు సవాల్ విసిరిన జార్జ్ బుష్!

Aug 21 2014 1:15 PM | Updated on Sep 2 2017 12:14 PM

బిల్ క్లింటన్ కు సవాల్ విసిరిన జార్జ్ బుష్!

బిల్ క్లింటన్ కు సవాల్ విసిరిన జార్జ్ బుష్!

'ఐస్ బకెట్ ఛాలెంజ్' ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, సెలబ్రీటీలు తడిసిముద్దవుతున్నారు.

వాషింగ్టన్: 'ఐస్ బకెట్ ఛాలెంజ్' ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, సెలబ్రీటీలు తడిసిముద్దవుతున్నారు. ఓ వైరల్ ఫీవర్ లా ఐస్ బకెట్ ఛాలెంజ్ ప్రముఖులను వెంటాడుతోంది. తాజాగా అమెరికా మాజీ ఆధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా ఈ ఛాలెంజ్ లో భాగస్వామి అయ్యారు. నేవి బ్లూ క్రూనెక్ టీషర్టు ధరించిన బుష్.. ఐఎస్ వాటర్ బకెట్ ను తన మీద కుమ్మరించుకున్నారు. 
 
మరో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు బుష్ ఛాలెంజ్ విసిరారు. అంతేకాకుండా తన కూతరు జెన్నా బుష్ హెగర్ ను ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. ఐస్ వాటర్ స్నానం చేసిన బుష్ నిధి కోసం ఓ చెక్ కూడా రాశారు.  లా గెరిగ్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన నిధికి కోసం అమెరికాలో ఐస్ బకెట్ ఛాలెంజ్ ను ప్రారంభించారు. ఎవరైనా ఐస్ నీళ్లతో స్నానం చేసి.. మరి కొంతమందికి ఛాలెంజ్ ను విసిరడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ ఛాలెంజ్ ను ప్రపంచంలోని ప్రముఖలందరూ స్వీకరిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement