సిక్కింలో బీజేపీకి షాక్‌! | BJP loses Sikkim Assembly bypoll | Sakshi
Sakshi News home page

సిక్కింలో బీజేపీకి షాక్‌!

Apr 15 2017 4:42 PM | Updated on Mar 29 2019 9:31 PM

సిక్కింలో బీజేపీకి షాక్‌! - Sakshi

సిక్కింలో బీజేపీకి షాక్‌!

గట్టి పోటీ ఇస్తారని భావించిన బీజేపీ అభ్యర్థి సురేష్‌ ఖనల్‌ శర్మకు కేవలం 374 ఓట్లు మాత్రమే..

సిక్కిం ఉప ఎన్నికలో అధికార సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డీఎఫ్‌) అభ్యర్థి దిల్లీ రామ్‌ థాపా సమీప బీజేపీ అభ్యర్థిపై ఘనవిజయం సాధించారు. ఇటీవల అప్పర్‌ బర్తుక్‌ అసెంబ్లి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన 8వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికలో మొత్తం 9,427 ఓట్లు పోలవ్వగా.. అందులో అధికార పార్టీ ఎమ్మెల్యేకు 8,406 ఓట్లు వచ్చాయి. ఆయనకు గట్టి పోటీ ఇస్తారని భావించిన బీజేపీ అభ్యర్థి సురేష్‌ ఖనల్‌ శర్మకు కేవలం 374 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఇక బరిలోకి దిగిన కాంగ్రెస్‌ అభ్యర్థి సుమిత్ర రాయ్‌కి నోటా కన్న రెండు తక్కువగా 98 ఓట్లు రావడం గమనార్హం. బరిలో మొత్తం ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు ఉండగా వారందరికీ కలిపి 449 ఓట్లు వచ్చాయి. నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రేమ్‌ సింగ్‌ తమంగ్‌ అనర్హతకు గురికావడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement