ఇష్టమైన తండ్రులు.. ఒబామా, షారూఖ్ | Barack Obama, Shah Rukh Khan voted most admired dads | Sakshi
Sakshi News home page

ఇష్టమైన తండ్రులు.. ఒబామా, షారూఖ్

Jun 13 2014 12:48 AM | Updated on Sep 2 2017 8:42 AM

ఇష్టమైన తండ్రులు.. ఒబామా, షారూఖ్

ఇష్టమైన తండ్రులు.. ఒబామా, షారూఖ్

ప్రపంచంలో అత్యంత ఇష్టమైన తండ్రులుగా.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్‌ఖాన్ నిలిచారు.

షాదీ డాట్ కామ్ ఆన్‌లైన్ సర్వేలో వెల్లడి
 
 
 న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత ఇష్టమైన తండ్రులుగా.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్‌ఖాన్ నిలిచారు. ఫాదర్స్ డే నేపథ్యంలో షాదీ డాట్ కామ్ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో వీరిద్దరూ అత్యధిక ఓట్లు దక్కించుకున్నారు. సుమారు 5,500 మంది ఈ ఆన్‌లైన్ సర్వేలో పాలుపంచుకున్నారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన తండ్రి ఎవరని భారత మహిళలను ప్రశ్నించగా.. ఎక్కువమంది షారూఖ్ పేరే చెప్పారు. ‘ఇండియాస్ మోస్ట్ పాపులర్ ఫాదర్’గా 42.5 శాతం మంది షారూఖ్‌కే ఓటేశారు. ఆ తర్వాతి స్థానంలో 36.9 శాతం ఓట్లతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నిలిచాడు. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్‌బచ్చన్ 20.6శాతం ఓట్లతో మూడో స్థానం దక్కించుకున్నా డు. ఇతర దేశస్తుల్లో అత్యంత ఇష్టమైన తండ్రులు ఎవరని ప్రశ్నించగా.. 40.3శాతం మంది ఒబామా పేరు చెప్పారు. ఆ తర్వాతి స్థానాల్లో హాలీవుడ్ నటు డు విల్ స్మిత్(31.4), మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డేవిడ్ బెక్‌హమ్(15.2), ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ (13.1) శాతం ఓట్లు దక్కించుకున్నారు. భారతదేశంలో మెచ్చుకోదగిన తండ్రీ కూతుళ్లు ఎవరని ప్రశ్నిస్తే.. 43.2శాతం మంది షారూఖ్-సుహానా పేర్లే చెప్పారు. ఆ తర్వాతి స్థానంలో మహేష్‌భట్-ఆలియాభట్, ప్రకాశ్ పదుకొనే-దీపికాపదుకొనే, అనిల్‌కపూర్-సోనమ్‌కపూర్ ఉన్నారు.

 

మెచ్చుకోదగిన తండ్రీకొడుకులు ఎవరంటే 33.4 శాతం మంది బాలీవుడ్ నటులు రిషీకపూర్-రణబీర్ కపూర్ పేర్లు చెప్పారు. ఆ తర్వాతి స్థానంలో అమితాబ్-అభిషేక్, షారూఖ్-ఆర్యన్ ఉన్నారు. సెలబ్రిటీ హోదా ఉన్న ప్రముఖులు తమ కుటుంబ సభ్యులతో ఎంత సమయం గడుపుతారు.. కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారనే అంశాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించినట్టు షాదీ డాట్ కామ్ సీవోవో గౌరవ్ రక్షిత్ స్పష్టం చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement