ఏకకాలంలో తొమ్మిది చిత్రాల నిర్మాణం | at a time producing nine films, says C. aswinidutt | Sakshi
Sakshi News home page

ఏకకాలంలో తొమ్మిది చిత్రాల నిర్మాణం

Jan 28 2017 8:39 AM | Updated on Sep 5 2017 2:21 AM

ఏకకాలంలో తొమ్మిది చిత్రాల నిర్మాణం

ఏకకాలంలో తొమ్మిది చిత్రాల నిర్మాణం

చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, నాని వంటి హీరోలతో భారీ సినిమాలు తీయనున్నట్లు అశ్వినీ దత్‌ చెప్పారు.

తిరుపతి: కొద్దికాలంగా ఫాం కోల్పోయిన స్టార్‌ ప్రొడ్యూసర్‌ సి. అశ్వనీదత్‌ తిరిగి పుంజుకునేందుకు భారీ ప్రణాళికలు రచిస్తున్నారు. 2017,2018 సంవత్సరాల్లో ఏకకాలంలో ఏకంగా తొమ్మిది చిత్రాలు నిర్మించనున్నట్లు దత్‌ వెల్లడించారు. శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు.

చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, నాని వంటి హీరోలతో భారీ సినిమాలు తీయనున్నట్లు అశ్వినీ దత్‌ చెప్పారు. మెగాస్టార్‌ చిరంజీవితో అశ్వనీదత్‌ మరుపురాని ఎన్నో హిట్‌ సినిమాలు అందించిన సంగతి తెలిసిందే. దాదాపు దశాబ్దం తర్వాత ‘ఖైదీ నంబర్‌ 150’తో చిరు రీ ఎంట్రీ ఇవ్వడం, ఇక ముందు కూడా సినిమాల్లో నటిస్తానని ప్రకటించిన నేపథ్యంలో మెగాస్టార్‌ 151వ సినిమా ఎవరితో చేస్తారు? అనే చర్చ మొదలైంది. ఖైదీ నిర్మాత రాంచరణే చిరు 151వ సినిమానూ నిర్మిస్తారని, ఆ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వహిస్తారని తెలిసింది. అశ్వనీ దత్‌ ప్రణాలిక అమలైతే గనుక వైజయంతి బ్యానర్‌లోనే చిరు 152వ సినిమా రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement