ఈశాన్య రాష్ట్రాలతో సంబంధాలు కట్‌ | assam floods stop the trains North eastern states | Sakshi
Sakshi News home page

ఈశాన్య రాష్ట్రాలతో సంబంధాలు కట్‌

Aug 17 2017 5:48 PM | Updated on Sep 17 2017 5:38 PM

ఈశాన్య రాష్ట్రాలతో సంబంధాలు కట్‌

ఈశాన్య రాష్ట్రాలతో సంబంధాలు కట్‌

భారీ వర్షాలు, వరదల కారణంగా ఈశాన్య రాష్ట్రాలకు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

గువాహటి: భారీ వర్షాలు, వరదల కారణంగా ఈశాన్య రాష్ట్రాలకు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు వారం రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధనంలో ఉన్నాయి. దీంతో బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, అసోంలను ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే అన్ని రైళ్లు ఈ నెల 12 వ తేదీ నుంచి నిలిచిపోయాయి. 20వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చని ఈశాన్య రైల్వే పేర్కొంది. ఎంతో కీలకమైన, బెంగాల్‌లోని జల్పాయిగురి, బిహార్‌లోని కటిహార్‌ స్టేషన్లు వరదలో చిక్కుకోవటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని, దీంతో అన్ని రైళ్లను రద్దు చేసినట్లు వివరించింది.

"అసోం దుఃఖదాయిని" బ్రహ్మపుత్రా నది విలయతాండవానికి 100 మంది బలయ్యారు. 22 లక్షల మందికిపైగా నిరాశ్రయులు కాగా వందల వేల సంఖ్యలో జంతువులు వరదలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా ఉప్పొంగిన బ్రహ్మపుత్రా నది.. అతిప్రమాదకరంగా ప్రవహిస్తూ తీరం వెంబడి ఊళ్లన్నింటినీ ముంచేస్తోంది. నదిలోకి ఇంకా వరద నీరు వచ్చిచేరుతుండటంతో ఉధృతి ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడంలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement