అలాంటి పరిశ్రమలపై త్వరలో చర్యలు | Action soon against industrial units polluting Ganga: Government | Sakshi
Sakshi News home page

అలాంటి పరిశ్రమలపై త్వరలో చర్యలు

Aug 6 2015 2:23 PM | Updated on Sep 27 2018 8:33 PM

గంగా నదిలోకి వ్యర్థాలతో కూడిన కలుషిత నీటిని వదులుతూ మురికి కూపంగా మారుస్తున్న పరిశ్రమలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణ బోర్డులకు ఆదేశాలు జారీ చేసింది.

న్యూఢిల్లీ: గంగా నదిలోకి వ్యర్థాలతో కూడిన కలుషిత నీటిని వదులుతూ మురికి కూపంగా మారుస్తున్న పరిశ్రమలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణ బోర్డులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు లోక్ సభలో కేంద్ర మంత్రి ఉమా భారతి గురువారం ప్రకటన చేశారు. గంగా శుద్ధి కార్యక్రమంపై తాము తయారు చేసిన ప్రణాళిక తుది మెరుగులకు చేరిందని, త్వరలోనే కేబినెట్కు పంపించి ఆమోదింపజేసి అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు.

ఇప్పటికే గంగా శుద్ధి కోసం నమామి గంగా అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. గంగా నది శుద్ధి కార్యక్రమాన్ని తాము ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నామని, ఇది విజయవంతం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని ఆమె విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలు కూడా తాము విడుదల చేస్తున్న వ్యర్థాల విషయంలో మరోసారి పునరాలోచన చేసుకోవాలని, నదిలోకి విడుదల చేయకుండా ప్రత్యామ్నాయాలను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement