ఢిల్లీలో కొనసాగుతున్న అధికారులు బదిలీ పర్వం
అధికారుల బదిలీ పర్వాన్ని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం జోరుగా కొనసాగిస్తూనే ఉంది. తాజాగా నగర అభివృద్దిశాఖ ప్రధాన కార్యదర్శి అరుణ్ గోయల్ పై బదిలీ వేటు వేసింది. Aam Aadmi Party,Delhi Jal Board, bureaucratic reshuffle
అధికారుల బదిలీ పర్వాన్ని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం జోరుగా కొనసాగిస్తూనే ఉంది. తాజాగా నగర అభివృద్దిశాఖ ప్రధాన కార్యదర్శి అరుణ్ గోయల్ పై బదిలీ వేటు వేసింది. గోయల్ స్థానంలో ఎస్ఎస్ యాదవ్ ను ప్రధాన కార్యదర్శి గా నియమిస్తూ... అదనంగా పౌర సరఫరాల కమిషనర్ బాధ్యతలను అప్పగిస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 6 తేదిన ఢిల్లీ జల్ బోర్డులో 800 మంది అధికారులను బదిలీ చేయడం దేశ రాజధానిలో సంచలనం రేపింది.
ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (ఎన్ డిఎంసీ) డిప్యూటీ చైర్మన్ పదర్మిని సింగ్లాను విద్యాశాఖ డైరెక్టర్ గా బదిలీ చేశారు. పౌర సరఫరాల అదనపు కార్యదర్శిగా బాధ్యతలను చేపట్టిన నిహారికా రాయ్ ని డిప్యూటేషన్ పై ఎన్ డిఎంసీ డిప్యూటి కమిషనర్ గా నియమించారు.