ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. నగరవ్యాప్తంగా మంగళవారం సంభవించిన కారు బాంబు పేలుళ్లలో దాదాపు 22 మంది మృతి చెందారు.
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. నగరవ్యాప్తంగా మంగళవారం సంభవించిన కారు బాంబు పేలుళ్లలో దాదాపు 22 మంది మృతి చెందారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ఏడాది మొదటి ఆరునెలలో దేశంలో తీవ్రవాదుల దాడులు, హింసలో 5,576 మంది మృతి చెందగా, 11,666 మంది గాయాలపాలైయ్యారని ఇరాక్లోని యూఎన్ అసిస్టెంట్ మిషన్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.