నగర శివార్లో ఉన్న ప్రభుత్వ భూ కుంభకోణం కేసులో 13 మందిని అరెస్టు చేశారు.
భూ కుంభకోణం కేసులో 13 మంది అరెస్ట్
Oct 16 2014 5:56 PM | Updated on Sep 2 2017 2:57 PM
భువనేశ్వర్:నగర శివార్లో ఉన్న ప్రభుత్వ భూ కుంభకోణం కేసులో 13 మందిని అరెస్టు చేశారు. గతంలో ఒడిశా ప్రభుత్వం కొంతమందికి మంజూరు చేసిన భూమిని వ్యవసాయానికి ఉపయోగించకుండా వేరే వ్యక్తులకు అమ్మేయడంతో దీనిపై క్రైం బ్రాంచ్ విచారణ చేపట్టింది. 1969-1973 ప్రాంతంలో కొంతమందికి ప్రభుత్వ భూములను అప్పగించింది. అయితే ఆ భూములను వారు ఉపయోగించకపోవడంతో ఆ ఒప్పందాలను తాజాగా రద్దు చేసిన ప్రభుత్వం విచారణ చేపట్టాలని ఆగస్టు నెలలో క్రైం బ్రాంచ్ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విచారణ చేపట్టిన అధికారులు 13 మందిని అరెస్టు చేశారు. ఇందులో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సెప్టెంబర్ 19 వ తేదీన కుద్రా జిల్లా కలెక్టర్ నివేదిక ప్రకారం ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన అధికారులు.. మరో కొంతమందిని గురువారం అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement