నేడు ఐదు కుటుంబాలకు వైఎస్ షర్మిల పరామర్శ | Ys sharmial paramarsayatra to be continued on second day from Nalgonda | Sakshi
Sakshi News home page

నేడు ఐదు కుటుంబాలకు వైఎస్ షర్మిల పరామర్శ

Jun 10 2015 8:33 AM | Updated on May 25 2018 9:20 PM

నేడు ఐదు కుటుంబాలకు వైఎస్ షర్మిల పరామర్శ - Sakshi

నేడు ఐదు కుటుంబాలకు వైఎస్ షర్మిల పరామర్శ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన రెండో విడత పరామర్శ యాత్రలో రెండోరోజు నల్లగొండ జిల్లాలో కొనసాగునుంది.

నల్లగొండ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన రెండో విడత పరామర్శ యాత్రలో  రెండోరోజు నల్లగొండ జిల్లాలో కొనసాగనుంది. ఈ రోజు ఐదు కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. బుధవారం ఉదయం  ఆలేరు మండలం శరాజీపేటలో శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి మోత్కూరు మండలం పొడిచేడులో నర్సమ్మ కుటుంబానికి పరామర్శిస్తారు. ఆ తరువాత రామన్నపేట మండలం సిరిపురంలో వీరయ్య కుటుంబాన్ని పరామర్శించ నున్నారు. అలాగే కట్టంగూర్ మండలకేంద్రంలో రాములు కుటుంబాన్ని పరామర్శిస్తారు. భీమారంలో ఎన్. శేఖర్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు.

కాగా, వైఎస్ షర్మిల శుక్రవారం వరకు నాలుగు రోజులపాటు నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లోని 18 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆయన తరఫున పరామర్శ యాత్రను చేపట్టిన షర్మిల.. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఇదివరకే యాత్రను నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement