దేశంలో జైళ్లు సరిపోవు

Women Conference Against CAA,NRC And NPR At Hyderabad - Sakshi

జైల్‌ భరో ఆందోళన్‌ నిర్వహణపై అసదుద్దీన్‌ ఒవైసీ

సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా మహిళా సదస్సు

సాక్షి, హైదరాబాద్‌: సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌కు వ్యతి రేకంగా జైల్‌ భరో ఆందో ళన్‌ నిర్వహిస్తే దేశంలోని జైళ్లు సరిపోవని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. శివరాంపల్లి లోని జామియా ఇస్లామియా దారుల్‌ ఉలుమ్‌లో ఆదివారం యూనైటెడ్‌ ముస్లిం యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా జరిగిన మహిళా సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. మోడీకి వ్యతిరేకంగా గళం విప్పితే దాడులకు పాల్పడుతున్నారన్నారు. ‘‘నరేంద్ర మోడీజీ.. ఒక సమయం వస్తోంది..జైల్‌ భరో ఆందోళన్‌ నిర్ణయం తీసుకుంటాం.

దేశంలోని జైళ్లలో మూడు లక్షల మంది కంటే ఎక్కువగా నింపలేరు. మూకుమ్మడిగా రోడ్డుపైకి వస్తే దేశంలోని జైళ్లు సరిపోవు’’అని పేర్కొన్నారు. బాధ్యతగల ఒక మంత్రి అసభ్య పదజాలంతో ఆందోళనకారులపై కాల్పులు జరపమని పిలుపునివ్వడం ఆయన మానసిక స్థితిని బహిర్గతపరుస్తోందన్నారు. మతాలకతీతంగా ఈ దేశం అందరిదీ అని ఆయన స్పష్టం చేశారు. దేశాన్ని హిందుత్వ అజెండా నుంచి కాపాడవల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌కు వ్యతి రేకంగా ఉద్యమం కొనసాగుతుందని, గాం«ధీజీ, అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ముందుగు సాగుతామని ప్రకటించారు. ఈ సదస్సులో ఇస్లామిక్‌ పండితులు, మహిళా ప్రతినిధులు,పౌర హక్కుల కార్యకర్తలు ప్రసంగించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top