ఓ గుర్తుతెలియని మహిళ దారుణహత్యకు గురైన సంఘటన గురువారం మండలంలోని నాగవరం గ్రామంలో వెలుగు చూసింది. సీఐ షాకీర్ హుస్సేన్, ఎస్‌ఐ నాగశేఖరరెడ్డి
వనపర్తిరూరల్: ఓ గుర్తుతెలియని మహిళ దారుణహత్యకు గురైన సంఘటన గురువారం మండలంలోని నాగవరం గ్రామంలో వెలుగు చూసింది. సీఐ షాకీర్ హుస్సేన్, ఎస్‌ఐ నాగశేఖరరెడ్డి కథనం.. గ్రామంలోని వనపర్తి సంస్థానాధీశులకు చెందిన వాసుదేవమ్మ తోటలోని చింతచెట్ల వనం నుంచి దుర్వాసన వస్తుండటంతో తోట కాపలాదారు అక్కడి వెళ్లి చూడగా ఓ మహిళ మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వనపర్తి డీఎస్పీ జోగుల చెన్నయ్య, సీఐ షాకీర్ హస్సేన్, రూరల్ ఎస్‌ఐ నాగశేఖరరెడ్డి సంఘటనస్థలాన్ని పరిశీలించారు. మహిళను అత్యాచారం చేసి రాళ్లతో తలపైమోది హత్యచేసి తర్వాత నిప్పంటించినట్లు పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో మద్యం సీసాలు, మహిళ చెప్పులు, గాజులు లభించినట్లు పోలీసులు వెల్లడించారు. పదిరోజుల క్రితం హత్యజరిగి ఉంటుందని డీఎస్పీ తెలిపారు. కేసుదర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.