నాన్నా... ఆత్మహత్య చేసుకుంటున్నా! | woman professor suicide ! | Sakshi
Sakshi News home page

నాన్నా... ఆత్మహత్య చేసుకుంటున్నా!

Mar 25 2015 7:09 PM | Updated on Nov 6 2018 7:56 PM

నాన్నా... ఆత్మహత్య చేసుకుంటున్నా! - Sakshi

నాన్నా... ఆత్మహత్య చేసుకుంటున్నా!

'నాన్నా... నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని డైరీలో రాసి... తండ్రికి ఫోన్ చేసి చెప్పింది ఓ మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్.

హైదరాబాద్: 'నాన్నా... నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని డైరీలో రాసి... తండ్రికి ఫోన్ చేసి చెప్పింది ఓ మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్. దాంతో ఇంట్లో ఆమె కుటుంబ సభ్యులు కంగారు పడి...పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు ఆమె కోసం అన్వేషణ ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం.... నగరంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్శిటీలో మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తుంది.

అయితే ఎప్పటిలాగా బుధవారం ఉదయం యూనవర్శిటీకి వచ్చిన సదరు మహిళ ప్రొఫెసర్... తాను అత్మహత్య చేసుకుంటున్నానంటూ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. అంతేకాకుండా ఆ డైరీ యూనివర్శిటీ లైబ్రరీలో ఉందని చెప్పి ఫోన్ పెట్టేసింది. దాంతో కంగారు పడిన వారు వెంటనే యూనివర్శిటీకి చేరుకున్నారు. అనంతరం ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. యూనివర్శిటీలో ఆమె ఆచూకీ లభించకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ కోసం ప్రయత్నించారు. మెదక్ జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాలలో ఆమె సెల్ సిగ్నల్స్ను పోలీసులు ట్రేస్ చేశారు. వెంటనే అక్కడి పోలీసులను నగర పోలీసులు అప్రమత్తం చేశారు. దాంతో మహిళ ప్రొఫెసర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement