గడ్డివాములో యువతి సజీవ దహనం ! | Woman fired by unidentified men in nizamabad district | Sakshi
Sakshi News home page

గడ్డివాములో యువతి సజీవ దహనం !

May 22 2015 9:33 AM | Updated on Sep 3 2017 2:30 AM

గడ్డివాములో యువతి సజీవ దహనం !

గడ్డివాములో యువతి సజీవ దహనం !

నిజామాబాద్ జిల్లా జర్కన్పల్లి మండలం పుప్పల్లపల్లి గ్రామ శివారులో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా జర్కన్పల్లి మండలం పుప్పల్లపల్లి గ్రామ శివారులో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. కొంతమంది ఆగంతకులు యువతిని గడ్డివాములో వేసి కాల్చి వేశారు. దాంతో మంటలు భారీగా ఎగసి పడటంతో స్థానికులు గడ్డివాము వద్దకు చేరుకున్నారు. దాంతో ఆగంతకులు అక్కడి నుంచి పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి మంటలార్పి వేశారు. అనంతరం గడ్డివాములోని మృతదేహన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు పుప్పల్లపల్లి గ్రామానికి చేరుకుని యువతి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికే సదరు మృతదేహం గుర్తించడానికి వీలు లేని విధంగా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సదరు మహిళను తీసుకువచ్చి ఇక్కడ దహనం చేశారా ? లేక వేరే చోట హత్య చేసి ఇక్కడ కాల్చి వేశారా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతుంది. అందులోభాగంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement