కార్మికుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓసీటీఎల్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ మస్తాన్‌రావు శనివారం మృతిచెందారు.
నార్కట్‌పల్లి(నల్లగొండ): కార్మికుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓసీటీఎల్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ మస్తాన్‌రావు శనివారం మృతిచెందారు. తమకు వ్యతిరేకంగా ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారంటూ గురువారం కొందరు కార్మికులు మస్తాన్‌రావుపై దాడి చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయన ఎల్‌బీ నగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. కాగా పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తరలించారు.