ప్రజల ఎజెండానే.. మా ఎజెండా | we are for public service | Sakshi
Sakshi News home page

ప్రజల ఎజెండానే.. మా ఎజెండా

May 24 2014 3:17 AM | Updated on Aug 15 2018 9:20 PM

ప్రజల ఎజెండానే.. మా ఎజెండా - Sakshi

ప్రజల ఎజెండానే.. మా ఎజెండా

ప్రజల ఎజెండానే పార్టీ ఎజెండాగా ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అన్నారు.

వరంగల్, న్యూస్‌లైన్ : ప్రజల ఎజెండానే పార్టీ ఎజెండాగా ఉ ద్యమ స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అన్నారు. హన్మకొండలోని అశోకా కాన్ఫరెన్స్‌హాలులో శుక్రవారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మూడవసారి తనను ఎమ్మెల్యే గా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు, సహకరించిన ప్రజాసంఘాలు, తెలంగాణవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తెలంగాణ ఉద్యమం కారణంగా పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేకపోయామని, ఈసారి అభివృద్ధి సంక్షేమానికి పునరంకితమవుతామని చెప్పారు. తెలంగాణవాదానికి పట్టం కట్టిన వారందరికీ రుణపడి ఉంటామని, కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలుపుతానని పేర్కొన్నా రు.
 
కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీకి సంబంధిం చిన భూసమస్యను ఎంపీ కడియం సహకారం తో పరిష్కరించి పూర్తి చేస్తామన్నారు. కాజీపేటను రైల్వే డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు, రెఫరల్ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో వినియోగించే విధంగా, జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్య లు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్, వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్ అభివృద్ధి, ఐటీ హబ్ గా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేస్తామని చెప్పారు. నియోజకవర్గ ప్రజల స మస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాన ని,  గతంలో చేపట్టిన స్లమ్ దర్శన్, అపార్ట్‌మెం ట్ దర్శన్, అడ్డా ములాఖత్‌లను శని, ఆది, సో మవారాల్లో కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.
 
 అసంఘటిత కార్మికులు, చిరువ్యాపారులు, కాలనీలు, అపార్ట్‌మెంట్‌లలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రాధాన్యమివ్వన్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ ఆశీర్వదిస్తే మంత్రి పదవి లభిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో టీఆర్‌ఎస్ అర్బన్ ప్రచార కార్యదర్శి కోరబోయిన సాంబయ్య, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, టీఆర్‌ఎస్వీ సెక్రటరీ జ నరల్ వాసుదేవరెడ్డి, పార్టీ నాయకులు అబూబకర్, శివశంకర్, సారంగపాణి, బూర విద్యాసాగర్, అశోక్‌రావు, బోడ డిన్నా, చాగంటి ర మేష్, దశరథరామారావు, పుప్పాల ప్రభాకర్, గుజ్జారి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement