ఎస్సారెస్పీ నీటి విడుదల వాయిదా | water release will be late for 4 days | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీ నీటి విడుదల వాయిదా

May 28 2015 10:12 AM | Updated on Sep 3 2017 2:50 AM

కరీంనగర్ జిల్లా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో తాగునీటి అవసరాలను తీర్చే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల వాయిదా పడింది.

సారంగాపూర్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో తాగునీటి అవసరాలను తీర్చే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల వాయిదా పడింది. ఈ మూడు పట్టణాల్లోని చెరువులను నింపటానికి అర టీఎంసీ నీటిని గురు, శుక్రవారాల్లో వదలాల్సి ఉంది. అనివార్య కారణాలతో ఈ కార్యక్రమం నాలుగు రోజులకు వాయిదా పడిందని ఎస్సారెస్పీ డీఈ చక్రునాయక్ తెలిపారు. అలాగే, వరంగల్ నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు లోయర్ మానేరు డ్యాం(ఎల్‌ఎండీ) నీటిని ఈనెల 28వ తేదీ బదులు 29వ తేదీన విడుదల చేయనున్నట్లు డ్యాం అధికారులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement