పాడి రైతులకు ఆన్లైన్ చెల్లింపులు | Vijaya Dairy online payment on formers for big notes cancellation | Sakshi
Sakshi News home page

పాడి రైతులకు ఆన్లైన్ చెల్లింపులు

Nov 23 2016 2:55 AM | Updated on Sep 4 2017 8:49 PM

పాడి రైతులకు ఆన్లైన్ చెల్లింపులు

పాడి రైతులకు ఆన్లైన్ చెల్లింపులు

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో విజయ డెరుురీకి పాలు పోసే రైతులకు ఆన్‌లైన్ ద్వారా సొమ్ము చెల్లించాలని విజయ డెరుురీ నిర్ణరుుంచింది.

15 రోజులకోసారి వారి బ్యాంకు ఖాతాల్లోకే సొమ్ము
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో విజయ డెరుురీ నిర్ణయం
భవిష్యత్తులోనూ ఆన్‌లైన్ చెల్లింపులే...   

సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో విజయ డెరుురీకి పాలు పోసే రైతులకు ఆన్‌లైన్ ద్వారా సొమ్ము చెల్లించాలని విజయ డెరుురీ నిర్ణరుుంచింది. వచ్చే పదిహేను రోజులకు సంబంధించిన చెల్లింపులను రైతు ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు రైతులకు 15 రోజులకోసారి నగదు రూపంలో నేరుగా చెల్లించే పద్ధతి ఉంది. పెద్ద నోట్ల రద్దు... చిల్లర సమస్య తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులోనూ ఆన్‌లైన్లో రైతు ఖాతాలకు చెల్లింపు పద్దతిని కొనసాగిస్తామని... దీనివల్ల ఎవరికీ ఇబ్బందులు ఉండబోవని పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా ‘సాక్షి’కి చెప్పారు.

63 వేల మంది రైతులకు ప్రయోజనం..
తెలంగాణలో విజయ డెరుురీకి రోజూ 63 వేల మంది రైతులు పాలు పోస్తుంటారు. దాదాపు 5 లక్షల లీటర్ల పాలు వారి నుంచి సేకరిస్తున్నారు. ఇందుకోసం విజయ డెరుురీ ఏడాదికి రూ. 350 కోట్ల మేరకు రైతులకు చెల్లింపులు చేస్తుంది. దీంతోపాటు విజయ డెరుురీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. ఆ ప్రకారం ఏడాదికి రూ. 72 కోట్లు ఇస్తున్నారు. ప్రోత్సాహక సొమ్మును ఇప్పటికే రైతు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. దీంతోపాటు పాలకు ఇచ్చే సేకరణ సొమ్మును కూడా ఆన్‌లైన్లో రైతుల ఖాతాల్లో వేయాలని నిర్ణరుుంచారు. ఇదిలావుంటే పాడి రైతులకు ఇచ్చే ప్రోత్సాహక సొమ్ము రూ. 50 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్లు చెప్పినా.. అవి ఇంకా రైతులకు చేరలేదని తెలిసింది.

ఎన్‌సీడీసీ సభ్యునిగా సురేశ్ చందా...
జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) సభ్యుడిగా సురేశ్ చందా నియమితులయ్యారు. జాతీయ స్థారుులో సభ్యుడిగా నియమితులవడం వల్ల పశు సంవర్థక, పాడి శాఖలకు పెద్ద ఎత్తున ఎన్‌సీడీసీ నుంచి రుణాలు పొందడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అనేక రాష్ట్రాలకు దక్కని అవకాశం తెలంగాణకు దక్కడంపై సురేశ్ చందాకు పలువురు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement