వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం | Venugopalasvami kalyanotsavam | Sakshi
Sakshi News home page

వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం

Feb 26 2015 1:27 AM | Updated on Sep 2 2017 9:54 PM

ఆమనగల్లు మండలం చరికొండలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో మంగళవారం వేణుగోపాల స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.

ఆమనగల్లు : ఆమనగల్లు మండలం చరికొండలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో మంగళవారం వేణుగోపాల స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం పెళ్లి పందిరిలో స్వామి కల్యాణాన్ని వేద పండితులు శ్రీమాన్ చక్రవర్తి శ్రీనివాసాచార్యులు, చక్రవర్తి రామాచార్యులు, చక్రవర్తి కిరణాచార్యులు, వేణాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు.

సోమవారం రాత్రి స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కల్యాణ మహోత్సవంలో సర్పంచ్ లాల్‌కోట నర్సింహ, ఎంపీటీసీ సభ్యురాలు గౌని యాదమ్మ, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మమ్మ, స్థానికులు వీరారెడ్డి, అద్దాల రాములు, లక్ష్మయ్య, లింగంగౌడ్, జంగయ్య, భీష్మాచారి, రాంరెడ్డి,యాదిరెడ్డి, కరుణాకర్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement