ఆ కథనాల వెనకున్న ఉద్దేశమేంటి? | Venugopala Chary Questioned Media Intention about metro train project | Sakshi
Sakshi News home page

ఆ కథనాల వెనకున్న ఉద్దేశమేంటి?

Sep 17 2014 4:56 PM | Updated on Sep 4 2018 3:39 PM

ఆ కథనాల వెనకున్న ఉద్దేశమేంటి? - Sakshi

ఆ కథనాల వెనకున్న ఉద్దేశమేంటి?

మెట్రో రైలు ప్రాజెక్టుపై రెండు పత్రికల్లో వచ్చిన కథనాలు తెలంగాణ, హైదరాబాద్‌ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి అన్నారు.

హైదరాబాద్: మెట్రో రైలు ప్రాజెక్టుపై రెండు పత్రికల్లో వచ్చిన కథనాలు తెలంగాణ, హైదరాబాద్‌ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కథనాలు రాయటం ఏమేరకు సమంజసమని ఆయన అడిగారు. ప్రైవేటు కంపెనీకి వత్తాసు పలికేలా కథనాలు రాయటం వెనకున్న ఉద్ధేశాలను ఆయన ప్రశ్నించారు.

మెట్రో ప్రాజెక్ట్‌ వివాదంపై తెలంగాణ సీఎం కార్యాలయం కూడా ప్రెస్‌నోటు విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా రెండు పత్రికలు మెట్రోపై కథనాన్ని ప్రచురించాయని పేర్కొన్నారు. మెట్రోరైలు ఎల్‌ అండ్‌ టీ, ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సర్వసాధారణమని తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టించేలా రెండు పత్రికల కథనాలు ఉన్నాయని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement