స్వయానా మామే ఓ అల్లుడ్ని గొడ్డలితో నరికాడు.
స్వయానా మామే ఓ అల్లుడ్ని గొడ్డలితో నరికాడు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో శనివారం అర్ధరాత్రిఈ ఘటన జరిగింది. కొండం మహేందర్‌రెడ్డి (50) ఇంటి ముందు నిద్రిస్తుండగా... మామ రాజిరెడ్డి గొడ్డలితో దాడి చేశాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో మహేందర్‌రెడ్డిని చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. కుటుంబ విభేదాలే హత్యకు కారణమని తెలుస్తోంది.