జానా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక | TRS rebel leaders to join Congress Nalgonda | Sakshi
Sakshi News home page

జానా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక

Jun 1 2018 6:55 AM | Updated on Aug 29 2018 4:18 PM

TRS rebel leaders to join Congress Nalgonda - Sakshi

పార్టీలో చేరిన నాయకులు

త్రిపురారం : మండలంలోని కాపువారిగూడెం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ అబంగాపురం ఎంపీటీసీ హంజీ, మాజీ సర్పంచ్‌ మంగ్లానాయక్‌తో పాటు మరికొంత మంది కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మర్ల చంద్రారెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ధనావత్‌ భాస్కర్‌నాయక్‌ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో సీఎల్పీనేత కుందూరు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎల్పీనేత జానారెడ్డి పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు. నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ చేపడుతున్న అభివృద్ధిని ఆకాంక్షించి టీఆర్‌ఎస్‌లోకి వలసలు వెళ్లిన వారంతా తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చి చేరుతున్నారన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పేద ప్రజలకు అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టి అమలు చేసిందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులంతా కలిసి కట్టుగా ఉండి వచ్చే 2019 ఎన్నికల్లో సాగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో నేనావత్‌ జాంమ్లా, పానుగోతు గాస్యా, సీతారాంనాయక్, మూడు హన్మంతు ఉన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు అనుముల శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ చైర్మన్లు అనుముల నర్సిరెడ్డి, బుసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు మైలారిశెట్టి సైదయ్య, నాయకులు అల్లంపల్లి జానయ్య, మట్టాయ్యచారి, వస్త్రాం, ధర్మానాయక్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement