గులాబీ పండుగ: కేసీఆర్‌కు అభినందనలు | TRS pleenary begins in kompally | Sakshi
Sakshi News home page

గులాబీ పండుగ: కేసీఆర్‌కు అభినందనలు

Apr 21 2017 11:23 AM | Updated on Aug 14 2018 11:02 AM

గులాబీ పండుగ: కేసీఆర్‌కు అభినందనలు - Sakshi

గులాబీ పండుగ: కేసీఆర్‌కు అభినందనలు

అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీ 16వ ప్లీనరీ గురువారం కొంపెల్లిలో ఘనంగా ప్రారంభమైంది.

హైదరాబాద్‌: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీ 16వ ప్లీనరీ గురువారం కొంపెల్లిలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా వరుసగా ఎనిమిదో సారి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌)ను పార్టీ నేతలు, శ్రేణులు అభినందించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి ప్లీనరీని ప్రారంభించారు.

టీఆర్‌ఎస్‌ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ సీఎం కేసీఆర్‌, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, శ్రేణులకు స్వాగతం పలికారు. కేసీఆర్‌ ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాల వివరాలు తెలుపుతూ.. సర్కారు సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement