తెలంగాణ శకటానికి అవకాశమివ్వండి | trs mp's meet central minister arunjaitley | Sakshi
Sakshi News home page

తెలంగాణ శకటానికి అవకాశమివ్వండి

Jan 17 2017 3:26 AM | Updated on Aug 20 2018 5:20 PM

గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం ప్రదర్శనకు అవకాశమివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీని టీఆర్‌ఎస్‌ ఎంపీలు జితేందర్‌రెడ్డి, బీబీ పాటిల్‌ కోరారు.

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం ప్రదర్శనకు అవకాశమివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీని టీఆర్‌ఎస్‌ ఎంపీలు జితేందర్‌రెడ్డి, బీబీ పాటిల్‌ కోరారు. సోమవారం అరుణ్‌ జైట్లీని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలసిన ఎంపీలు.. తెలంగాణలో ఎయిమ్స్, ఐఐఎం ఏర్పాటుకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు.

వెనకబడిన జిల్లాల అభివృద్ధికి మూడో విడత నిధులు కేటాయించాలని, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు వివిధ దశల్లో ఎంపికైన తెలంగాణ బతుకమ్మ శకటాన్ని చివరి దశలో కేంద్ర రక్షణ శాఖ తిరస్కరించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement