కాంగ్రెస్ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్ నేతలు హెచ్చరించారు.
కాంగ్రెస్ నేతలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫైర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్ నేతలు హెచ్చరించారు. తీరు మార్చుకోకుంటే నియోజకవర్గాల్లో తిరగనీయ బోమన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి విలేక రులతో మాట్లాడారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని గువ్వల విమర్శించారు.
వంశీచంద్ పేపర్ పులిగా మారాలనుకుంటే తమకేమీ అభ్యం తరం లేదని, ఆయనకు టీడీపీ ఎమ్మెల్యే రేవం త్ రెడ్డికి పట్టిన గతే పడుతుందని హెచ్చరిం చారు. ‘మీ తప్పులు కప్పి పుచ్చుకోవడానికి మాపై ఆరోపణలు చేస్తే ఖబడ్దార్. వంశీచంద్ వెంటనే మంత్రి జూపల్లికి క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. జూపల్లిపై వంశీచంద్ వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని వెంక టేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రజలు తరిమి కొడితే జూపల్లి ఐదు సార్లు ఎలా గెలిచారో వంశీచంద్ చెప్పాలని ప్రశ్నించారు.