బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ | TRS leaders take on revanth reddy | Sakshi
Sakshi News home page

బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్

Sep 26 2014 1:53 AM | Updated on Aug 10 2018 8:08 PM

బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, ఎంపీ బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. హై దరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి ని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీయడానికి ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్ర లో రేవంత్ పావుగా మారాడన్నారు.

మెట్రో పనులు ఆగవని, టీడీపీ చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ద్ధాలని నిరూపించడానికి బహిరంగచర్చకు రావాలని సవాల్ చేస్తే.. రేవంత్ తప్పించుకుని తిరుగుతున్నారన్నారు. 1995 నుండి ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై విచారణ జరుపుదామని జూపల్లి సవాల్ చేశారు. అసెంబ్లీలో వారి బండారం బయటపెడ్తామన్నారు. అత్యంత అవినీతిపరుడైన నేతగా చంద్రబాబు పేరును తెహెల్కా రాసిందని గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement