టీఆర్ ఎస్ కు ఎదురుగాలి | trs defeats in mlc elections | Sakshi
Sakshi News home page

టీఆర్ ఎస్ కు ఎదురుగాలి

Mar 26 2015 7:29 AM | Updated on Mar 29 2019 9:13 PM

తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో అధికార టీఆర్ ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో అధికార టీఆర్ ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ స్థానంలో టీఆర్ ఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. టీఆర్ ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ పై బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు 13,318 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆయన కేవలం మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఘనవిజయం సాధించడం గమనార్హం. టీ ఆర్ ఎస్ పార్టీ పాలనలో ఘోరంగా విఫలమైందనడానికి ఈ ఎన్నికలే నిదర్శనమని బీజేపీ పేర్కొంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement