కాళేశ్వరంతో వేలాది ఎకరాలకు సాగునీరు : వేముల వీరేశం | TRS Candidate Vemula Veeresham Road Show In Ramannapeta | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంతో వేలాది ఎకరాలకు సాగునీరు : వేముల వీరేశం

Dec 6 2018 10:32 AM | Updated on Dec 6 2018 10:33 AM

TRS Candidate Vemula Veeresham Road Show In Ramannapeta - Sakshi

రామన్నపేట : రోడ్‌షోలో మాట్లాడుతున్న వేముల వీరేశం

సాక్షి, రామన్నపేట : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మండలంలోని వేలాది ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నట్లు నకిరేకల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం తెలిపారు. బుధవారం రామన్నపేటలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనేక ప్రజాసంక్షేమ పథకాలతో ప్రజల మనసును చూరగొన్న కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు, ఆసరా పెన్షన్ల రెట్టింపు, నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. ధర్మారెడ్డిపల్లి కాలువ పనులు వేగంగా జరుగుతున్నాయని త్వరలోనే చెరువులను నింపుతామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గంగుల వెంకటరాజిరెడ్డి, నాయకులు పూస బాలకిషన్, ముక్కాముల దుర్గయ్య, సోమనబోయిన సుధాకర్‌యాదవ్, అంతటి రమేష్, ఆకవరపు మధుబాబు, గుత్తా నర్సిరెడ్డి, రామిని రమేష్, సాల్వేరు లింగయ్య, మినుముల వెంకటరాజయ్య, ఎండీ నాజర్, చల్లా వెంకట్‌రెడ్డి, పోచబోయిన మల్లేశం పాల్గొన్నారు. 

మరిన్ని వార్తాలు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement