'నారాయణపేట అభివృద్ధి బాధ్యత నాది’  | TRS Campaign In Mahbubnagar Rajendar Reddy | Sakshi
Sakshi News home page

'నారాయణపేట అభివృద్ధి బాధ్యత నాది’ 

Nov 28 2018 6:01 PM | Updated on Nov 28 2018 6:59 PM

TRS Campaign In Mahbubnagar Rajendar Reddy  - Sakshi

మరికల్‌:  ప్రచారం చేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు 

సాక్షి, కోయిల్‌కొండ: ఓటువేసి తనను గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత తాను చూసుకుంటానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌ రాజేందర్‌రెడ్డి అన్నారు. గడిచిన నాలుగన్నర ఏళ్లలో రూ.600 కోట్లకు పైగా నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని రాజేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని వింజామూర్, నక్కవానికుంట, ఎల్లారెడ్డిపల్లి, సంగనోనిపల్లి, తమ్మలోనిబండతండా, అయ్యవారిపల్లి, చందాపూర్, అంకిళ్ల గ్రామాలలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నారాయణపేటను ప్రత్యేకంగా నిధులు కేటాయించి 60ఏళ్లుగా వెనకబడిన నియెజకవర్గాన్ని నాలుగేళ్లలో ఎన్నో కార్యక్రమాలను చేపట్టానని అన్నారు. ప్రతిపక్ష నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలే తమకు ఓట్లను రాలుస్తాయన్నారు.  ఇందులో టీఆర్‌ఎస్‌ నాయకులు రవి, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణయ్య, మల్లయ్య, లక్ష్మారెడ్డి, వాసు తదితరులు పాల్గొన్నారు.  

మరికల్‌: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌.రాజేందర్‌రెడ్డిని గెలిపించాలని  పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రామారెడ్డి అన్నారు. మరికల్‌లో మంగళవారం టీఆర్‌ఎస్‌ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించి మరికల్‌ మండల అభివృద్దికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో రామస్వామి, జగదీశ్, కొండారెడ్డి, లంబడి తిరుపతయ్య, బాలకిష్ణ, నర్సిములు, సుధాకార్‌గౌడ్, రవి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement